రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించిన మోదీ

24-05-2019 Fri 19:14
  • ముగిసిన కేబినెట్ సమావేశం
  • మంత్రులకు రాష్ట్రపతి విందు
  • సమావేశం కానున్న పార్లమెంటరీ బోర్డు
ప్రధాని మోదీ అధ్యక్షతన నేటి సాయంకాలం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మేరకు ప్రధాని మోదీ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు పంపించారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో 16వ లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేస్తూ ఇందులో తీర్మానం చేశారు. జూలై 3వ తేదీలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. దీనిలో భాగంగానే మోదీ మే 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7 గంటల సమయంలో 16వ లోక్‌సభలో మంత్రులుగా పనిచేసిన వారికి రాష్ట్రపతి విందు ఏర్పాటు చేశారు. ఈ విందు అనంతరం పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఇందులో పార్టీ నేతను ఎన్నుకోనున్నారు.