ap7am logo

కాజల్ 'కోమలి' సినిమా నుంచి కొత్త పోస్టర్

Fri, May 24, 2019, 04:39 PM
  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'సీత'
  • వచ్చేనెల 21న తమిళ సినిమా  రిలీజ్
  •  జయం రవి జోడీ కట్టిన కాజల్
కాజల్ తాజా చిత్రంగా ఈ రోజునే 'సీత' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే ఆశాభావంతో కాజల్ వుంది. ఇక తమిళంలో ఆమె చేసిన 'కోమలి' చిత్రం వచ్చేనెలలో అక్కడ విడుదల కానుంది.

తమిళంలో జయం రవి - కాజల్ జంటగా 'కోమలి' సినిమా నిర్మితమైంది. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్తా హెగ్డే ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి 7th లుక్ గా ఒక పోస్టర్ ను వదిలారు. ఈ రొమాంటిక్ స్టిల్ ఆకట్టుకునేలా వుంది. జూన్ 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో అక్కడ తన కెరియర్ మళ్లీ ఊపందుకుంటుందనే ఆశతో కాజల్ వుంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. 
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
GarudaVega Banner Ad
Latest Video News..
Advertisement