akhil: అఖిల్ నాల్గొవ సినిమా లాంచ్ .. దర్శకుడిగా 'బొమ్మరిల్లు' భాస్కర్

  • 'బొమ్మరిల్లు' భాస్కర్ తో అఖిల్
  •  సంగీత దర్శకుడిగా గోపీసుందర్
  •  త్వరలో రెగ్యులర్ షూటింగ్

అఖిల్ కథానాయకుడిగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కొంతసేపటి క్రితం హైదరాబాద్ - ఫిల్మ్ నగర్లోని 'దైవసన్నిధానం'లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నాగార్జున - అమలతో పాటు దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యేలోగా కథానాయికల ఎంపిక జరగనుందని అంటున్నారు. అఖిల్ చేసిన మూడు సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. అందువలన వాళ్లంతా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. 

More Telugu News