renuka chowdary: నిజం నిష్టూరంగా ఉండొచ్చు...కానీ నేతలు మేల్కొంటేనే కాంగ్రెస్‌కు పూర్వవైభవం: రేణుకా చౌదరి

  • అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాతే ఈ పని చేసి ఉండాల్సింది
  • పెండింగ్‌ పనుల పూర్తికి బాధ్యత తీసుకోవాలి
  • ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని కితాబు

నేతలు మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపడితే కాంగ్రెస్‌కు పూర్వవైభవం సాధించడం పెద్ద కష్టం కాదని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు రేణుకాచౌదరి అన్నారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన రేణుకాచౌదరి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాతే ఈ పని చేసి ఉండాల్సిందన్నారు.

ప్రజల తరపున బాధ్యత వహిస్తూ అభివృద్ధి పనులు పూర్తయ్యేందుకు మనవంతు కృషి చేసినప్పుడే వారికి దగ్గరకాగలమన్నారు. నిజం నిష్టూరంగా అనిపించవచ్చుగాని నేతల తీరు మారనన్నాళ్లు పార్టీ పునరుజ్జీవం కష్టమని చెప్పారు. ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో పార్టీ కార్యకర్తలు ధైర్యంగా టీఆర్‌ఎస్‌తో తలపడ్డారన్నారు. తనకు మద్దతుగా నిలిచిన 4 లక్షల మంది ఓటర్లకు కృతజ్ఞతలన్నారు మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయో సీఎల్పీ నేత భట్టిని అడగాలని కోరారు. తోటి మహిళగా కవిత ఓటమిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నానన్నారు. ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి కేసీఆర్ అవసరం లేకపోవడం సంతోషం కలిగిస్తోందని చెప్పారు.

More Telugu News