YSRCP: లోక్ సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్!

  • అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం
  • 22 లోక్ సభ సీట్లు సాధించిన వైసీపీ
  • తృణమూల్ తో కలిసి నాలుగోస్థానం

ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో విజయ పతాకాన్ని ఎగురవేసి, అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటి, దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ, కాంగ్రెస్, డీఎంకేల తరువాత అత్యధిక స్థానాలను గెలిచిన పార్టీగా నిలిచింది. దేశవ్యాప్తంగా 542 లోక్ సభ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కాగా, బీజేపీకి 303, కాంగ్రెస్ కు 52, డీఎంకేకు 36 స్థానాలు లభించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు 22 సీట్ల చొప్పున గెలిచి, నాలుగో స్థానాన్ని పంచుకున్నాయి. వీటి తరువాత శివసేన 18, జేడీ (యూ) 16, బీజేడీ 12, బీఎస్పీ 10, టీఆర్ఎస్ 9, సమాజ్ వాదీ 5, ఎన్సీపీ 4 స్థానాలతో నిలిచాయి. మిగతా సీట్లను టీడీపీ, అన్నా డీఎంకే సీపీఐ సహా ఇతరులు దక్కించుకున్నారు.

More Telugu News