అద్దెకు ఇల్లు కావాలంటూ లోపలికి చొరబడి యువతిపై అత్యాచారం

24-05-2019 Fri 09:36
  • భద్రాచలంలో ఘటన
  • గతంలో అదే ఇంట్లో అద్దెకు ఉన్న నిందితుడు
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
అద్దెకు ఇల్లు కావాలని ఇంట్లోకి చొరబడిన ఓ యువకుడు ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి తెగబడిన ఘటన తెలంగాణలోని భద్రాచలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా ఓ కాలనీలో అద్దెకు ఉంటూ బూర్గంపాడు మండలంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే భరత్ అనే యువకుడు మూడు నెలల క్రితం గదిని ఖాళీ చేసి స్వగ్రామం వెళ్లిపోయాడు.

తాజాగా గురువారం మరోమారు భద్రాచలం వచ్చిన భరత్.. అద్దె ఇంటి కోసం తిరిగాడు. ఈ క్రమంలో గతంలో తాను అద్దెకు ఉన్న ఇంటికి వచ్చి ఆరా తీశాడు. ఆ సమయంలో ఇంట్లో యువతి ఒక్కర్తే ఉండడం, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పరారయ్యాడు. యువతి అరుపులతో అక్కడికి చేరుకున్న చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.