Jagan: మూడో పిన్న వయస్కుడు... 46 ఏళ్లకే సీఎంగా జగన్!

  • 46 సంవత్సరాల 6 నెలలకు సీఎం
  • మరో వారంలో ప్రమాణ స్వీకారం
  • రికార్డుల్లోకి ఎక్కనున్న జగన్

మరో వారంలో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్, అతి పిన్న వయసులో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయనున్న మూడో వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ప్రస్తుతం జగన్ వయసు 46 సంవత్సరాల 6 నెలలు కాగా, ఆంధ్రప్రదేశ్‌ విడిపోకముందు 38 సంవత్సరాల 11 నెలల వయసులో దామోదరం సంజీవయ్య సీఎంగా పనిచేశారు. ఆ తరువాత 45 సంవత్సరాలా 5 నెలల వయసులో చంద్రబాబునాయుడు సీఎం అయ్యారు. వీరిద్దరి తరువాత తక్కువ వయసులో సీఎం కానున్నది జగనే. ఇక దేశవ్యాప్తంగా పరిశీలిస్తే, అసోంకు 1985లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రఫుల్ల కుమార్‌ మహంత వయసు 33 ఏళ్లు మాత్రమే. ఆ తరువాత 2012లో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి అఖిలేష్ యాదవ్ వయసు 39 సంవత్సరాలే.

More Telugu News