Congress: వయనాడ్‌లో రాహుల్ ప్రభంజనం.. రికార్డు గెలుపును సొంతం చేసుకున్న కాంగ్రెస్ చీఫ్

  • వయనాడ్‌లో 4.31 లక్షల మెజారిటీతో ఘన విజయం
  • గత రికార్డులన్నీ బద్దలు
  • అమేథీలో ఓడిన రాహుల్‌కు ఊరట

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌లో గెలిచి చరిత్ర సృష్టించారు. ఉత్తరప్రదేశ్‌లోని  సంప్రదాయ స్థానమైన అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలైన కాంగ్రెస్ చీఫ్.. వయనాడ్‌లో మాత్రం రికార్డు విజయాన్ని అందుకున్నారు. అమేథీలో ఓడినప్పటికీ వయనాడ్‌లో గెలవడం ద్వారా రాహుల్ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు.

వయనాడ్‌లో రాహుల్‌‌ తన సమీప అభ్యర్థి, అధికార ఎల్‌డీఎఫ్ నేత పీపీ సునీర్‌‌పై 4,31,770 ఓట్లతో విజయం సాధించారు. 2014లో మహారాష్ట్రలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ నేత ప్రితం గోపీనాథ్‌రావు ముండే 6,96,321 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.పాటిల్‌పై విజయం సాధించారు. అలాగే, పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం అభ్యర్థి అనిల్ బసు 5,92,502 ఓట్లతో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు వారి చెంతన రాహుల్ చేరారు.

More Telugu News