YSRCP: మరోసారి సత్తా చాటిన కొడాలి నాని... గుడివాడలో జయభేరి!

  • దేవినేని అవినాశ్ పై విజయం
  • గుడివాడలో ఏమాత్రం తగ్గని నాని హవా
  • మంత్రి పదవి ఖాయమంటూ ఊహాగానాలు

ఏపీ రాజకీయాల్లో మొదటినుంచి కృష్ణా జిల్లాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ గెలవడాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. ముఖ్యంగా, గుడివాడ స్థానం ఎన్టీఆర్ హయాం నుంచి ప్రముఖమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే, టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన కొడాలి నాని కొన్నాళ్లుగా గుడివాడను తన గెలుపు అడ్డాగా మార్చుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా నానీకి గండికొట్టాలని టీడీపీ సర్వశక్తులు ఒడ్డింది. దేవినేని అవినాశ్ వంటి నవయువకుడ్ని బరిలో దింపింది.

ఓ దశలో టీడీపీ వర్సెస్ నాని మధ్య పోరాటం తీవ్రరూపు దాల్చింది. అవినాశ్ సైతం తన తండ్రి దేవినేని నెహ్రూ పేరుప్రఖ్యాతులు, టీడీపీ పథకాలు కలిసొస్తాయని భావించారు. అయితే అవినాశ్ కంటే అనుభవశాలి అయిన కొడాలి నాని గుడివాడ ఓటర్ల మనసు గెలుచుకోవడంలో మరోసారి విజయం సాధించారు. దేవినేని అవినాశ్ పై ఆయన 18,112 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాగా, కొడాలి నానికి జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి ఖాయం అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

More Telugu News