Gowtham Gambhir: 3 లక్షల 77 వేల ఓట్ల మెజారిటీతో గౌతమ్ గంభీర్ ఘన విజయం

  • ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన గంభీర్
  • తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ
  • ఐఎన్‌సీ అభ్యర్థిగా అర్వీందర్ సింగ్ లవ్లీ పోటీ

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఘన విజయం సాధించాడు. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన గంభీర్‌ను అధిష్ఠానం తూర్పు ఢిల్లీ నియోజకవర్గం పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో నిలిపింది. ఈ నియోజకవర్గం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అర్వీందర్ సింగ్ లవ్లీ పోటీ చేశారు. అర్వీందర్‌ సింగ్‌పై గంభీర్ 3 లక్షల 77 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా గంభీర్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించిన ఆప్ అభ్యర్థి అతిశి మర్లేనా మూడో స్థానానికి పరిమితమయ్యారు.

గంభీర్ తన గురించి అసభ్యకర పదజాలంతో కరపత్రాలను ముద్రించారంటూ అతిశి ఆ కరపత్రాన్ని మీడియా ఎదుట చదువుతూ ఇటీవల కన్నీటి పర్యంతమయ్యారు. తానే ఆ కరపత్రాన్ని ముద్రించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని, లేదంటే మీరు తప్పుకుంటారా? అని గంభీర్ సోషల్ మీడియా వేదికగా సవాల్ విసిరాడు. ఇక ఈ ఎన్నికల్లో గంభీర్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  

More Telugu News