Guntur District: నారా లోకేశ్ ఓటమి.. మంగళగిరిలో ఆర్కే గెలుపు!

  • మంగళగిరి నియోజకర్గంలో టీడీపీకి చుక్కెదురు
  • 5,200 ఓట్ల తేడాతో ఆర్కే విజయం
  • తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన లోకేశ్ కు నిరాశ

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకర్గంలో గెలుపోటములపై సర్వత్రా నెలకొన్న ఆసక్తికి తెరపడింది. టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తలపడ్డ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నిరాశే మిగిలింది. ఆర్కే చేతిలో లోకేశ్ ఓటమిపాలయ్యారు. 5,200 ఓట్ల తేడాతో ఆర్కే గెలుపొందారు. ఈ విజయంతో మంగళగిరి నుంచి రెండోసారి వరుసగా ఆర్కే నెగ్గినట్టయింది. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నారా లోకేశ్ తొలి పరాజయం చవిచూడాల్సి వచ్చింది. 

More Telugu News