Andhra Pradesh: ఇక మా తారకరాముడే ఆదుకోవాలి: సినీ నటుడు బ్రహ్మాజీ

  • ఇప్పటికే 35 స్థానాలకు పైగా వైసీపీ విజయం 
  • వైసీపీ 118 నియోజకవర్గాల్లో ఆధిక్యం
  • ‘కంగ్రాట్స్ వైఎస్ జగన్ గారు’ అంటూ ట్వీట్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే 35 స్థానాలకు పైగా విజయం సాధించిన వైసీపీ, 118 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో జగన్ ని సినీ నటుడు బ్రహ్మాజీ అభినందించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘కంగ్రాట్స్ వైఎస్ జగన్ గారు’ అంటూ అభినందించారు. అదే విధంగా, కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రానుండటంతో ప్రధాని మోదీకి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత బ్రహ్మాజీ మరో ట్వీట్ చేశారు. ‘ఇక మా తారకరాముడే ఆదుకోవాలి’ అని పేర్కొనడం గమనార్హం.

More Telugu News