Urmila matondkar: 80 వేల ఓట్ల వెనుకంజలో ‘రంగీలా' భామ

  • కాంగ్రెస్ టికెట్‌పై ముంబై నార్త్ ఈస్ట్ నుంచి బరిలోకి
  • తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం
  • భారీ ఓటమి దిశగా ఊర్మిళ 

రంగీలా భామ.. ఊర్మిళా మదోండ్కర్‌కి ముంబైలో ఎదురుగాలి వీస్తోంది. ముంబై నార్త్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఊర్మిళ లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం 80 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గోపాల్ శెట్టి విజయం దిశగా దూసుకుపోతున్నారు. 2014 ఎన్నికల్లో గోపాల్ శెట్టి లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. కాగా, ఈ ఎన్నికలతో రాజకీయాల్లోకి తొలిసారి అడుగుపెట్టిన ఊర్మిళ భారీ ఆధిక్యంతో ఓడిపోబోతున్నట్టు తేలడంతో ఆమె అభిమానులు కలవరపడుతున్నారు.

More Telugu News