Smrithi Irani: అమేథీలో హోరాహోరీగా తలపడుతున్న రాహుల్-స్మృతి ఇరానీ

  • గత ఎన్నికల్లో రాహుల్ చేతిలో పరాజయం పాలైన స్మృతి
  • వయనాడ్‌లో ఈజీగా గెలవబోతున్న రాహుల్
  • అమేథీలో మాత్రం పోటాపోటీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయనను నీడలా వెంటాడతానని చెప్పిన బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అనుకున్నంత పనీ చేస్తున్నారు. అమేథీలో రాహుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం రాహుల్ కంటే స్మృతి ముందంజలో ఉన్నారు. రాహుల్‌పై 2 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో స్మృతి కొనసాగుతున్నారు. అమేథీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి కూడా బరిలో ఉన్నారు. అయితే, వయనాడ్‌లో ఆయన గెలుపు నల్లేరుమీద నడకలా భావిస్తుండగా, అమేథీలో మాత్రం గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

గత ఎన్నికల్లో రాహుల్ చేతిలో ఓటమి పాలైన స్మృతి ఈసారి మాత్రం కాంగ్రెస్ చీఫ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. ఇక్కడ నువ్వా-నేనా? అన్నట్టుగా ఉంది. కాగా, స్మృతిపై రాహుల్ గతంలో లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో రాహుల్ 2.70 లక్షల ఓట్లు సాధించారు. 2004 ఎన్నికల్లో సోనియా గాంధీ తన స్థానాన్ని రాయ్‌బరేలీకి మార్చుకోవడంతో అప్పటి నుంచి ఆ స్థానంలో రాహుల్ బరిలోకి దిగుతున్నారు.

More Telugu News