Congress: దిగ్విజయ్ సింగ్‌కు చెమటలు పట్టిస్తున్న సాధ్వి

  • భోపాల్‌లో కాంగ్రెస్‌కు మూడు దశాబ్దాలుగా ప్రాతినిధ్యం కరవు
  • వెనకబడిన మాజీ సీఎం దిగ్విజయ్
  • 28 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

వివాదాస్పద నేత, మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు, బీజేపీ నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ భోపాల్‌లో కాంగ్రెస్ నేత  దిగ్విజయ్ సింగ్‌కు చెమటలు పట్టిస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దిగ్విజయ్ సింగ్‌పై సాధ్వి ఆధిక్యంలో ఉన్నారు.

మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి నిందితురాలు కాగా, దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. నిజానికి భోపాల్ నుంచి పోటీ చేయడానికి తొలుత దిగ్విజయ్ సింగ్ నిరాకరించారు. అయితే, ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఒత్తిడితో ఆయన బరిలోకి దిగారు. మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఖాతా తెరవని కాంగ్రెస్‌కు దిగ్విజయ్ ద్వారా ప్రాతినిధ్యం లభిస్తుందని భావించారు. అయితే, ఆ పార్టీ అంచనాలు తారుమారయ్యాయి. బీజేపీ ఇక్కడ 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ ఒక్క స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

More Telugu News