EC: ఈసీ అధికారిక ప్రకటన... 121 చోట్ల వైసీపీ ఆధిక్యం

  • వైసీపీకి 50 శాతానికి పైగా ఓట్లు
  • 38 శాతానికి పరిమితమైన టీడీపీ
  • జనసేనకు 6.8 శాతం ఓట్లు

ఎన్నికల కమిషన్ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, ఏపీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 142 స్థానాలకు సంబంధించిన ఫలితాల ట్రెండ్స్ వెలువడగా, 121 చోట్ల వైసీపీ, 25 చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉన్నాయి. ఇప్పటివరకూ కౌంట్ చేసిన ఓట్లలో వైసీపీకి 50.9 శాతం ఓట్లు రాగా, టీడీపీకి 38.2 శాతం ఓట్లు, జనసేనకు 6.8 శాతం ఓట్లు వచ్చాయి.

ఇక లోక్ సభ ఎన్నికలను పరిశీలిస్తే, 532 నియోజకవర్గాల ట్రెండ్స్ వెలువడగా, బీజేపీ 285 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 49 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. వైఎస్ఆర్ సీపీ 24 స్థానాల్లో, టీడీపీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. మిగతా పార్టీల విషయానికి వస్తే, తృణమూల్ కాంగ్రెస్ 24, బీఎస్పీ 12, బిజూ జనతాదళ్ 12, డీఎంకే 22, ఏఐఏడీఎంకే 2, జనతాదళ్ (యు) 16, ఎల్జేపీ 6, ఎన్సీపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీ 8 స్థానాల్లో, టీఆర్ఎస్ 10 స్థానాల్లో ముందంజలో ఉన్నాయని ఈసీ వెల్లడించింది.

More Telugu News