West Bengal: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ-బీజేపీ హోరాహోరీ

  • బీజేపీ 14, టీఎంసీ 20 స్థానాల్లో ఆధిక్యం
  • మూడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ 
  • ఒక స్థానంలోనే ఇతరులు

ఈ ఎన్నికల్లో దేశం మొత్తం దృష్టిని ఆకర్షించిన రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్ ఒకటి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ-ప్రధాని మోదీ మధ్య మొదటి నుంచి మాటల తూటాలు పేలాయి. విజయం కోసం ఇరు పార్టీలు చివరి వరకు చెమటోడ్చాయి. ఈ క్రమంలో ఎన్నడూ లేనంతగా ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో హింస చెలరేగింది. పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయడమే లక్ష్యంగా పావులు కదిపిన బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టే కనిపిస్తోంది.

ఇప్పటి వరకు వెల్లడైన వివరాల ప్రకారం.. రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. గతంలో రెండు సీట్లు మాత్రమే కలిగిన బీజేపీ ఈసారి దూసుకెళ్తోంది. బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మమత సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ మూడు స్థానాల్లోనూ, ఇతరులు ఒక స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నారు.

More Telugu News