Sachin Tendulkar: కోహ్లీ ఒక్కడే వరల్డ్ కప్ గెలవలేడు: సచిన్

  • జట్టులో సమష్టితత్వం అవసరం
  • ఎవరో ఇద్దరు రాణిస్తే సరిపోదు
  • కీలకదశలో అందరూ రాణించకపోతే నిరాశతప్పదు

మరి కొన్నిరోజుల్లో ఐసీసీ ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా విజయావకాశాలపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన అభిప్రాయాలు వెల్లడించారు. జట్టులోని సహచరుల మద్దతు లేకుండా విరాట్ కోహ్లీ ఒక్కడే వరల్డ్ కప్ గెలవలేడని స్పష్టం చేశారు. ప్రతి గేమ్ లోనూ ఎవరో ఇద్దరు ఆటగాళ్లు రాణించినా టీమ్ సపోర్ట్ లేనిదే టోర్నీలో విజయం సాధించలేరని, ప్రపంచకప్ లో కీలకదశలో జట్టుగా రాణించినప్పుడే విజయాలు సాధ్యమని అన్నారు. సమష్టి ప్రదర్శన లేకపోతే నిరాశ తప్పదని సచిన్ హెచ్చరించారు.

నాలుగోస్థానంలో బ్యాటింగ్ ఎవరు చేయాలన్నదానిపై చర్చ అనవసరమని, అదో నంబర్ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. నాలుగో నంబర్ లో ఎవరు బ్యాటింగ్ చేయాలన్నది ఓ సమస్యగా తాను భావించడంలేదని, టీమిండియాకు బ్యాట్స్ మెన్ కొదవలేరని, ఎవరైనా ఆ స్థానంలో కుదురుకోవచ్చని అన్నారు. 4, 6, 8 ఇలా ఏ స్థానం అయినా పరిస్థితికి తగ్గట్టుగా ఆడడమే కీలకమని వివరించారు.

More Telugu News