Train-18: మరిన్ని సౌలభ్యాలతో ట్రైన్-19కు రూపకల్పన చేయనున్న రైల్వే శాఖ

  • విజయవంతంగా పట్టాల పైకి ట్రైన్-18
  • ట్రైన్-18కి భిన్నంగా ట్రైన్-19 రూపకల్పన
  • చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలోనే అభివృద్ధి

ఇప్పటికే ట్రైన్ 18ను విజయవంతంగా పట్టాలెక్కించిన రైల్వే శాఖ తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ట్రైన్-19కు రూపకల్పన చేయనుంది. ఈ విషయమై రైల్వే శాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ, త్వరలోనే ట్రైన్‌-19కు సంబంధించి కోచ్‌ల తయారీ ప్రారంభిస్తామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ట్రైన్-18లో కేవలం కూర్చునే అవకాశం మాత్రమే ఉంది. దీనికి భిన్నంగా బెర్త్‌లతో ట్రైన్‌-19ను తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు.

ట్రైన్‌-19ను కూడా ట్రైన్-18ను అభివృద్ధి చేసిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలోనే అభివృద్ధి చేయనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం ట్రైన్-18 రైళ్లను భారత్ నుంచి దిగుమతి చేసుకునేందుకు పలు దేశాలు మొగ్గు చూపుతున్నాయని, కానీ సరిపడినన్ని రైళ్లను భారత్‌కు అందించిన తరువాతే ఎగుమతులపై దృష్టి సారిస్తామని అధికారులు తెలిపారు.

More Telugu News