prabhudeva: 'అభినేత్రి 2' నుంచి 'చక్కని పిల్ల' లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

  • 'అభినేత్రి' సీక్వెల్ గా 'అభినేత్రి 2'
  • సంగీత దర్శకుడిగా సామ్ సీఎస్
  •  ఈ నెల 31న సినిమా రిలీజ్

ప్రభుదేవా .. తమన్నా .. నందిత శ్వేత ప్రధాన పాత్రధారులుగా తమిళంలో రూపొందిన 'దేవి 2' ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో 'అభినేత్రి 2' టైటిల్ తో ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను పలకరించనుంది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు "చక్కని పిల్లా చక్కర బిళ్లా చిక్కని సోకుతో చంపొద్దే .. " అంటూ ఈ పాట సాగుతోంది. ఈ సాంగ్ మేకింగ్ షాట్స్ ను బట్టి ప్రభుదేవా - నందిత శ్వేతపై చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ ఫాస్టు బీట్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుంది. గతంలో తెలుగులో వచ్చిన 'అభినేత్రి' ఇక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. మరి దానికి సీక్వెల్ గా వస్తోన్న 'అభినేత్రి 2' కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి.

More Telugu News