allu arjun: సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధమైపోయిన బన్నీ

  • దసరాకి ఫ్యాన్స్ ను పలకరించాలనుకున్న బన్నీ 
  • 'సైరా' రానున్న కారణంగా తన సినిమా వాయిదా
  •  సంక్రాంతికి గట్టి పోటీ ఉన్నప్పటికీ రంగంలోకి  

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ముందుగా ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే సమయానికి చిరంజీవి 'సైరా' వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అందువలన తమ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడమే మంచిదనే నిర్ణయానికి త్రివిక్రమ్ - అల్లు అర్జున్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే బాలకృష్ణ - కేఎస్ రవికుమార్ సినిమా, మహేశ్ బాబు - అనిల్ రావిపూడి మూవీ, సాయిధరమ్ తేజ్ - మారుతి సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్టుగా చెప్పేశారు. ఇక రజనీ - మురుగదాస్ కాంబినేషన్లోని 'దర్బార్' కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంత గట్టి పోటీ ఉన్నప్పటికీ త్రివిక్రమ్ - అల్లు అర్జున్ తమ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపాలని నిర్ణయించుకోవడానికి కారణం, తమ కథపై గల నమ్మకమేనని తెలుస్తోంది.

More Telugu News