Telangana: వంటమనిషి పెళ్లికి హాజరైన కేసీఆర్ పై బాల్కసుమన్ ప్రశంసలు

  • ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర వంటపని చేసే వ్యక్తి వివాహం
  • ఆ వివాహానికి హాజరైన కేసీఆర్
  • ఫొటో పోస్ట్ చేసిన బాల్క సుమన్

సెలెబ్రెటీల పెళ్లిళ్లకే కాదు, తన దగ్గర పనిచేసే వాళ్ల పెళ్లిళ్లకు కూడా సీఎం కేసీఆర్ వెళ్లి వారిపై తనకు ఉన్న ప్రేమను చాటుకుంటారని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఈ విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. కేసీఆర్ దగ్గర వంట పని చేసే వ్యక్తి వివాహానికి కేసీఆర్ హాజరై, అతనికి మరచిపోలేని మధుర జ్ఞాపకాన్ని అందించారని బాల్క సుమన్ ప్రశంసించారు. ‘పెళ్ళికొడుకు ఏ రామోజీ మనవడో, అంబానీ తమ్ముడో కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర వంటపని చేస్తాడు. అతని వివాహానికి హాజరై ఇలా ఆత్మీయ ఆలింగనంతో జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకాన్ని అందించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్’ అని ఆ ట్వీట్ లో ప్రశంసించారు.  

More Telugu News