శ్రియ డ్యాన్స్ చేస్తుంటే... కోతిగా మారిపోయిన మనిషి ముఖం... వైరల్ వీడియో!

21-05-2019 Tue 12:20
  • గత సంవత్సరం వివాహం చేసుకున్న శ్రియ
  • ఆపై సినిమాలకు దూరంగా ఉంటున్న అందాల తార
  • తాజా వీడియోతో మరోమారు అభిమానుల ముందుకు
గత ఏడాది ఆండ్రీ కొశ్చవ్ ను వివాహం చేసుకున్న శ్రియ, ఆపై సినిమాలకు కాస్తంత దూరంగా ఉంటోంది. బాలకృష్ణ హీరోగా వచ్చిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' తరువాత మరో సినిమాలో కనిపించని ఈ భామ, సోషల్ మీడియాను మాత్రం విడిచి పెట్టలేదు. అప్పుడప్పుడూ తన వీడియోలను షేర్ చేస్తూ, అభిమానులను అలరిస్తూ ఉన్న శ్రియ, తాజాగా, పింక్ బికినీలో ఓ ఫోటో ముందు డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. శ్రియ డ్యాన్స్ చేస్తుంటే, ఆమె వెనుక ఫొటోలో ఉన్న మనిషి ముఖం కోతిగా మారిపోయింది. ఈ వీడియోను శ్రియ భర్త కొశ్చెవ్ తన స్మార్ట్ ఫోన్ లో బంధించాడని తెలుస్తోంది. దాన్ని మీరు కూడా చూడండి.