ntr: ఎన్టీఆర్ తదుపరి సినిమా ఆ దర్శకుడితోనే

  • రాజమౌళి సినిమాలో చేస్తోన్న ఎన్టీఆర్  
  • తరువాత ప్రాజెక్టు త్రివిక్రమ్ తో 
  • ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అరవింద సమేత'

ప్రస్తుతం ఎన్టీఆర్ .. రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ భారీ మల్టీ స్టారర్ చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగు పూర్తికావడానికీ, ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలాకాలం పడుతుంది. ఆ తరువాత సినిమాను ఎన్టీఆర్ ఏ దర్శకుడితో చేయనున్నాడనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రాజమౌళి తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తదుపరి సినిమా వుండనుందనేది తాజా సమాచారం. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనని కొంతమంది అభిమానులు కలుసుకున్నారు. ఆ సమయంలో రాజమౌళితో చేస్తోన్న సినిమా తరువాత ఏ దర్శకుడితో తదుపరి సినిమా ఉంటుంది? అని అభిమానులు అడిగిన ప్రశ్నకి ఆయన త్రివిక్రమ్ పేరు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'అరవింద సమేత' అభిమానుల మనసులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. 

ntr

More Telugu News