Himalayas: మోదీ ధ్యానం చేసిన కేదార్ నాథ్ గుహకు పెరిగిన డిమాండ్... బుకింగ్స్ నిలిపివేత!

  • ఇటీవల గుహలో మోదీ ధ్యానం
  • గుహలోకి వెళ్లేందుకు అనుమతి కోరుతున్న పర్యాటకులు
  • జూన్ తొలివారం వరకూ బుకింగ్స్ నిలిపివేత

 ఉత్తరాఖండ్ లోని కేదార్‌ నాథ్‌ ను ఇటీవల సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడి ధ్యాన గుహను సందర్శించి, ధ్యానం చేసి వచ్చిన తరవాత పర్యాటకుల నుంచి గుహలోకి వెళ్లేందుకు డిమాండ్ పెరగడంతో జూన్ మొదటివారం వరకూ బుకింగ్స్ నిలిపివేస్తున్నట్టు జీఎంవీఎన్ (గఢ్వాలా మండల్ వికాస్ నిగమ్) తెలిపింది.

గుహను సందర్శించాలని భావించేవారికి కొత్త నియమావళిని తయారు చేసినట్టు స్పష్టం చేసింది. సముద్ర మట్టానికి దాదాపు 12,500 అడుగుల ఎత్తున ఉన్న ఈ గుహలో పూర్తిస్థాయి ఆరోగ్యవంతులకే ప్రవేశార్హత ఉంటుంది. నరేంద్ర మోదీ ఈ గుహను సందర్శించిన తరువాత, ఇక్కడికి వచ్చే భక్తులంతా దీన్ని చూడాలని కోరుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి గుహ నిర్వాహకులకు ఫోన్లు వస్తున్నాయి. గుహలోకి వెళ్లేందుకు అనుమతించాలని పలువురు కోరుతున్నారు. దీంతో ప్రస్తుతానికి బుకింగ్స్ నిలిపివేశామని, అక్కడ మరిన్ని వసతులు, సౌకర్యాలు కల్పించి, పర్యాటకులకు అనుమతి ఇస్తామని జీఎంవీఎన్ ప్రతినిధులు వెల్లడించారు.

More Telugu News