keerthi suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'సఖి'గా రానున్న కీర్తి సురేశ్ 
  • షూటింగుకి రెడీ అవుతున్న రామ్ 
  • కిషోర్ తిరుమలతో రామ్ మరొకటి!    

*  కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా మహేశ్ కోనేరు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. నూతన దర్శకుడు నరేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'సఖి' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.
*  గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ వచ్చే నెల 5 నుంచి జరుగుతుంది. గతంలో ఈ సినిమా షూటింగులో గాయపడిన గోపీచంద్ పూర్తిగా కోలుకోవడంతో షూటింగ్ ప్రారంభిస్తున్నారు.
*  ప్రస్తుతం 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో నటిస్తున్న యంగ్ హీరో రామ్ దీని తర్వాత తమిళ రీమేక్ 'థాడం'లో నటిస్తాడు. స్రవంతి రవికిషోర్ నిర్మించే ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.

More Telugu News