EVM's: తిరుపతి కౌంటింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదంపై స్పందించిన అధికారులు

  • ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం
  • ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు
  • ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రంగా ఉన్నాయన్న అధికారులు

తిరుపతి కౌంటింగ్ కేంద్రంలో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై అధికారులు స్పందించారు. ఈ ప్రమాదానికి, ఈవీఎంలు, వీవీప్యాట్‌లు ఉన్న గదికి ఎటువంటి సంబంధం లేదని, అవన్నీ భద్రంగానే ఉన్నాయని తెలిపారు. నేతలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, కౌంటింగ్ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లు చేస్తుండగా తిరుపతి కౌంటింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది.

ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడ్డాయి. రెండు కంప్యూటర్లు, కొన్ని టేబుళ్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విషయం బయటకు రావడంతో నేతల్లో ఆందోళన నెలకొంది. ప్రమాదంలో ఈవీఎంలకు నష్టం వాటిల్లి ఉంటుందని టెన్షన్ పడ్డారు. అయితే, వాటికి ఏమీ జరగలేదని అధికారులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News