swaraj india: ‘కాంగ్రెస్’ చావడం మేలు: స్వరాజ్ ఇండియా అధినేత యోగేంద్ర

  • కాంగ్రెస్ పార్టీపై యోగేంద్ర మండిపాటు
  • దేశాన్ని కాపాడాలంటే బీజేపీని అడ్డుకుని తీరాలి
  • బీజేపీకి ప్రత్యామ్నాయంగా ‘కాంగ్రెస్’ విఫలం

కాంగ్రెస్ పార్టీపై స్వరాజ్ ఇండియా పార్టీ అధినేత యోగేంద్ర యాదవ్ మండిపడ్డారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలవడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ప్రజలు మళ్లీ పట్టం కట్టడం ఖాయమన్న విషయాన్ని నిన్నటి ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఈ నేపథ్యంలో యోగేంద్ర స్పందిస్తూ, దేశాన్ని కాపాడాలంటే బీజేపీని అడ్డుకుని తీరాలని, అది సాధ్యం కాకపోతే కాంగ్రెస్ పార్టీ చావడం మేలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక, అంతకుముందూ ఆ పార్టీ నేతలు దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు.  

ఇదిలా ఉండగా, యోగేంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఖుష్బూ స్పందిస్తూ, ఈ వ్యాఖ్యలు నిరాశకు గురి చేశాయని, ప్రతి దానికీ కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం సబబు కాదని, ఇలాంటి ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు.

More Telugu News