nitin gadkari: ఎగ్జిట్ పోల్స్ తుది ఫలితాలు కాదు కానీ కొన్ని సంకేతాలు ఇస్తాయి: నితిన్ గడ్కరీ

  • ఎగ్జిట్ పోల్స్ లో ఉన్నది తుది ఫలితాల్లో ప్రతిబింబిస్తుంది
  • ఎన్డీయేకు ప్రజలు పట్టం కట్టబోతున్నారు
  • మోదీనే మరోసారి ప్రధాని

ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఫలితాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ నేథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ అనేవి తుది ఫలితాలు కావని చెప్పారు. అయితే, బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే సంకేతాలను మాత్రం ఇచ్చాయని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని చెప్పారు. ప్రధాని మోదీ బయోపిక్ 'పీఎం నరేంద్రమోదీ' పోస్టర్ ను విడుదల చేసిన ఆయన... అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ ఫైనల్ కాదని, ఎగ్జిట్ పోల్స్ లో ఉన్నది తుది ఫలితాల్లో ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రధాని అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానంగా... మోదీ నాయకత్వంలో తాము ఎన్నికలకు వెళ్లామని ఇప్పటికే 20 నుంచి 50 సార్లు చెప్పానని గడ్కరీ అన్నారు. మోదీనే మరోసారి ప్రధాని అవుతారని తెలిపారు.

More Telugu News