kumaraswamy: ఇదంతా పక్కా ప్లాన్.. ప్రాంతీయ పార్టీలను గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం: కుమారస్వామి

  • ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే.. ఎగ్జాక్ట్ పోల్స్ కాదు
  • మోదీ గాలి వీస్తోందనే అభిప్రాయం కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నం
  • ప్రాంతీయ పార్టీలను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు

ఈ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీజేపీకి, మోదీకి పట్టం కట్టబోతున్నారంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన వేళ... ఎగ్జిట్ పోల్స్ పై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విమర్శలు గుప్పించారు. దేశంలో ఇంకా మోదీ గాలి వీస్తోందనే అభిప్రాయాన్ని కలిగించేందుకు ఎగ్జిట్ పోల్స్ ను వాడుకున్నారని ఆయన మండిపడ్డారు. ఒక పద్ధతి ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశారని, వీటిలో ఎంతమాత్రం వాస్తవం లేదని అన్నారు.

ఇవి కేవలం ఎగ్జిట్ పోల్స్ మాత్రమేనని, ఎగ్జాక్ట్ (కచ్చితమైన) పోల్స్ కావని కుమారస్వామి అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ద్వారా బీజేపీ అధికారంలోకి రాబోతోందని చెప్పించడం ద్వారా... ప్రాంతీయ పార్టీలు తమ అధీనంలోకి వచ్చేలా చేసుకోవడమే దీని వెనకున్న అసలు మర్మమని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగినంత మెజారిటీ రాని పక్షంలో... ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాంతీయ పార్టీలను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నమని తెలిపారు.

More Telugu News