dmk: ఎవరి పక్షాన ఉండేది 23 తర్వాతే నిర్ణయిస్తాం: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

  • మే 23 సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి
  • ఇప్పుడే యూపీఏ పక్ష పార్టీల సమావేశంతో ప్రయోజనం లేదు
  • యూపీఏ పక్ష పార్టీల్లో స్టాలిన్ వ్యాఖ్యలపై చర్చ

కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని నిన్నటి ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీఏ పక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఏ కూటమిలో చేరే విషయాన్ని ఎన్నికల ఫలితాల తర్వాతే తాము నిర్ణయిస్తామని తెలిపారు. మే 23 సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని, ఇప్పుడే, ఢిల్లీలో యూపీఏ పక్ష పార్టీలతో సమావేశం జరపడం వల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు యూపీఏ పక్ష పార్టీల్లో చర్చనీయాంశమైనట్టు సమాచారం. కాగా, బీజేపీ వ్యతిరేక పక్షాలు మాత్రం వరుస భేటీలు జరుపుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విపక్ష నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.  

More Telugu News