Telangana: హాజీపూర్ బాధితులతో కేటీఆర్ ఇప్పటికైనా నేరుగా మాట్లాడాలి.. వారిని ఆదుకోవాలి!: వి.హనుమంతరావు డిమాండ్

  • మీడియా సర్వేలను కొట్టిపడేసిన వీహెచ్
  • గతంలోనూ సర్వేలు తప్పుగా తేలాయని వ్యాఖ్య
  • హైదరాబాద్ లో మీడియాతో కాంగ్రెస్ నేత

కేంద్రంలో ఈసారి కూడా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమే అధికారం చేపట్టబోతోందన్న సర్వేలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కొట్టిపడేశారు. గతంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు చాలాసార్లు తప్పాయని గుర్తుచేశారు. తెలంగాణలో ఈసారి కనీసం 3 లోక్ సభ స్థానాలను దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వీహెచ్ మాట్లాడారు.

పంజాగుట్టలో డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించి తీరుతామని వి.హనుమంతరావు ప్రకటించారు. ఈ విషయంలో తమను ఎవరు అడ్డుకుంటారో చూస్తామని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా హాజీపూర్ అత్యాచార బాధిత కుటుంబాలకు సాయం చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ లో మాట్లాడినంత మాత్రాన బాధితుల కడుపు నిండదనీ, వారిని నేరుగా కలవాలని సూచించారు. కేటీఆర్ ఇప్పటికైనా గిమ్మిక్కులు మానుకుంటే మంచిదని వీహెచ్ హితవు పలికారు.

More Telugu News