kajal: 'సీత' సెట్లో నా కోసం ఎప్పుడూ ఒక డాక్టర్ సిద్ధంగా ఉండేవాడు: హీరోయిన్ కాజల్

  • స్వార్థంతో కూడిన మగువగా కనిపిస్తాను
  •  పాత్ర పరంగా చాలా సాహసాలు చేశాను
  •  ఈ నెల 24వ తేదీన విడుదల

కాజల్ ప్రధాన పాత్రధారిగా .. తేజ దర్శకత్వంలో 'సీత' సినిమా రూపొందింది. కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఈ సినిమాను ఈ నెల 24 వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో కాజల్ బిజీగా వుంది.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. 'నేనే రాజు నేనే మంత్రి' షూటింగు సమయంలోనే తేజ గారు నాకు 'సీత' కథ చెప్పారు. ఈ పాత్రను నాతోనే చేయాలని చెప్పేసి ప్రామిస్ తీసుకున్నాను. తన కలలను నిజం చేసుకోవడానికి స్వార్థం చూపించే ఒక మగువ కథ ఇది. ఈ పాత్రలో ఒదిగిపోవడానికి చాలా కష్టపడ్డాను. నటనకు మంచి అవకాశం వున్న పాత్ర. కథ ప్రకారం చాలా సాహసోపేతమైన సన్నివేశాల్లోను నటించాను. ఈ సినిమా షూటింగు సమయంలో చాలాసార్లు నాకు గాయాలయ్యాయి. నాకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ సమయంలో సెట్లో ఒక డాక్టర్ ను సిద్ధంగా ఉంచేవారు" అంటూ చెప్పుకొచ్చింది.

More Telugu News