Andhra Pradesh: ఆ రెండు ఊర్లలో వైసీపీ చాలా బలంగా ఉంది.. అందుకే టీడీపీ నేతలు రీపోలింగ్ కోరారు!: చెవిరెడ్డి భాస్కరరెడ్డి

  • చంద్రగిరిలో దశాబ్దాలుగా దళితులు ఓటింగ్ కు దూరం
  • అందుకే నేను వారి కోసం పోరాడాను
  • ఐదు గ్రామాల్లో రీపోలింగ్ దళిత-గిరిజనుల విజయమే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చంద్రగిరిలో దళితులు ఏళ్లతరబడి ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని వైసీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. అందుకే ఈ ఎన్నికల్లో ఎలాగైనా వారికి ఓటు హక్కు కల్పించాలన్న లక్ష్యంతో ఫిర్యాదు చేశానని చెప్పారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గత నెల 11న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళితులు ఓటేయలేకపోయారని వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంలో కమ్మపల్లె, ఎన్ఆర్ కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం గ్రామాల్లో ఈసీ రీలిపోంగ్ కు ఆదేశించడం దళిత- గిరిజనుల విజయమని అభిప్రాయపడ్డారు. కాలేపల్లి, కుప్పం బాదూరులో వైసీపీ చాలా బలంగా ఉందని చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. అందుకే టీడీపీ నేతలు అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని పట్టు పట్టారనీ, కానీ తాము మాత్రం అందుకు అభ్యంతరం చెప్పలేదని చెవిరెడ్డి గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.

More Telugu News