AP CM Chandrababu: ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అనంతరం... నేడు మళ్లీ డిల్లీకి చంద్రబాబు!

  • ఎన్టీయేతర పక్షాలను కూడగట్టేందుకు మరోమారు ప్రయాణం
  • రాహుల్‌తోపాటు ఇతర నేతలను కలిసే అవకాశం
  • ఉదయం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించాక నిర్ణయం

ఓవైపు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలన్నీ ఎన్డీయేకి మళ్లీ అధికారం ఖాయమని చెబుతున్నా, మరోపక్క ఎన్డీయేతర పక్షాలను ఏకంచేసే పనినిలో చంద్రబాబు బిజీగా వున్నారు. ‘ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించేలా ఎగ్జిట్‌ పోల్స్‌’ లేవంటూ కొట్టిపారేసిన చంద్రబాబు కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఈరోజు సాయంత్రం మరోసారి ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఇతర నేతలను కలవనున్నారని సమాచారం. మారుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్న చంద్రబాబు తాజా పరిణామాలపైనా ఢిల్లీ వేదికగా ఆయా పార్టీ పెద్దలతో చర్చించనున్నారు.

ఈరోజు ఉదయం ఆయన ముందుగా పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈనెల 23వ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్‌కు దిశానిర్దేశం చేసిన అనంతరం దేశరాజధానికి ప్రయాణమవుతారని భావిస్తున్నారు. ఎన్టీయే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ ఘంటాపథంగా ప్రకటించినా బాబు ప్రయాణం ఆసక్తి కలిగిస్తోంది.

More Telugu News