Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రిస్కీ ఫైట్స్ చేసిన కాజల్ 
  • 'హీరో'గా విజయ్ దేవరకొండ 
  • అఖిల్ నాలుగో సినిమా అప్ డేట్

*  తేజ దర్శకత్వంలో రూపొందిన 'సీత' చిత్రం కోసం రిస్కీ ఫైట్స్ చేశానని అంటోంది కథానాయిక కాజల్. 'ఈ సినిమా కోసం కాస్త రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. ఓ సీన్ లో అయితే, రెండు వందల కేజీల ఐస్ గడ్డల్ని మీద వేసుకుని ఫైట్ చేశాను. రియల్ ఫైట్స్ కూడా చేశాను. అలా ఈ సినిమా కోసం శారీరకంగా కూడా కష్టపడ్డాను' అని చెప్పింది. ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ అవుతోంది.  
*  విజయ్ దేవరకొండ నటించే చిత్రానికి 'హీరో' టైటిల్ని నిర్ణయించారు. తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహిస్తున్నాడు. బైక్ రేసింగ్ స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.
*  అఖిల్ అక్కినేని నటించే నాలుగో చిత్రం షూటింగ్ ఈ నెల 24న మొదలవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. కైరా అద్వానీ, రష్మిక పేర్లు పరిశీలనలో వున్నాయి.

More Telugu News