ec: ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. అవి నిజం కావొచ్చు, అబద్ధం కావొచ్చు!: టీడీపీ నేత వర్లరామయ్య

  • ఈసీని వెంటనే ప్రక్షాళన చేయాలి
  • మోదీ అన్నింటిని భ్రష్టు పట్టించారు
  • అమరావతిలో మీడియాతో వర్ల, యనమల

భారత ఎన్నికల సంఘాన్ని వెంటనే ప్రక్షాళన చేయాలని ఏపీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఈసీ తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడం వివక్షతకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషనర్ లావాసా వ్యాఖ్యలే నిదర్శనమని స్పష్టం చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వర్లరామయ్యతో కలిసి యనమల మాట్లాడారు.

మరోవైపు ఈ వ్యవహారంపై వర్లరామయ్య మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చివరికి ఈసీని కూడా భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాటకు విలువ లేదని సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా చెప్పడమే ఇందుకు నిదర్శమని వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్‌ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదనీ, అవి నిజం కావచ్చు లేదా అబద్ధం కూడా కావచ్చని రామయ్య పేర్కొన్నారు.

More Telugu News