USA: పుర్రెలో వైఫై యాంటెన్నాతో రంగులను గుర్తిస్తున్న అమెరికా యువకుడు!

  • వర్ణాంధతతో జన్మించిన యువకుడు
  • రంగులను గుర్తించలేని వైనం
  • టెక్నాలజీతో అధిగమించిన తీరు

అమెరికాకు చెందిన నీల్ హార్బిసన్ అనే యువకుడు వర్ణాంధత లోపంతో పుట్టాడు. అతడు రంగులను గుర్తించలేడన్న విషయాన్ని తల్లిదండ్రులు 11 ఏళ్ల వయసులో గుర్తించారు. అయితే ఇంగ్లాండ్ లో ఓ మ్యూజిక్ సింఫనీ నోట్స్ అధ్యయనం చేసే క్రమంలో అతడు రంగులను గుర్తించలేక నానా అవస్థలు పడ్డాడు. దాంతో తనను వేధిస్తున్న ఆ లోపాన్ని అధిగమించేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించాడు.

తనే స్వయంగా పరిశ్రమించి తలలో అమర్చుకునే విధంగా ఓ వైఫై యాంటెన్నా సెట్ ను రూపొందించాడు. వైద్యుల సాయంతో తలలో దాన్ని ఫిక్స్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి కంటిముందు కనిపించే రంగులను ఆ యాంటెన్నా గుర్తించి శబ్దాల రూపంలో వినిపిస్తుంది. ఆ శబ్దాల ఆధారంగా ఎదురుగా ఉన్న వస్తువు ఏ రంగులో ఉన్నదీ నీల్ హార్బిసన్ పసిగట్టేస్తాడు.

ఓ షాపింగ్ మాల్ కు వెళితే అక్కడున్న రంగురంగుల వస్తువులను గుర్తించిన యాంటెన్నా డీజే మ్యూజిక్ తరహాలో ధ్వనులు చేయడం తనను ఎంతగానో ఆకట్టుకుంటుందని నీల్ హార్బిసన్ సరదాగా చెబుతుంటాడు. కాగా, ఈ యువకుడు పుర్రెలో యాంటెన్నా ఫిక్స్ చేసుకున్న మొదటి సైబోర్గ్ (సగం మనిషి, సగం యంత్రం) గా ప్రభుత్వ అనుమతి కూడా పొందాడు.

USA

More Telugu News