Andhra Pradesh: చంద్రగిరిలోని పులివర్తిపల్లిలో ఉద్రిక్తత.. టీడీపీ నేత పులివర్తి నానిపై కేసు నమోదు!

  • పులివర్తిపల్లికి వెళ్లిన టీడీపీ నేత నాని
  • వైసీపీ పోలింగ్ ఏజెంట్ తో వాగ్వాదం
  • ఈసీ అధికారులకు వైసీపీ ఏజెంట్ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి నియోజకర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు ఓటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈరోజు రీపోలింగ్ సందర్భంగా పులివర్తిపల్లిలోని పోలింగ్ కేంద్రానికి టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని చేరుకున్నారు. అనంతరం వైసీపీ పోలింగ్ ఏజెంట్, వైసీపీ నేత చెవిరెడ్డి బావ కేశవులు రెడ్డితో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయిదాటడంతో వైసీపీ ఏజెంట్ పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పులివర్తి నానిని చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనపై కేసు నమోదుచేశారు.

చంద్రగిరిలోని ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, కాలూరు, కుప్పం బాదూరు గ్రామాల్లో రీపోలింగ్ జరుగుతోంది. ఇక్కడ దళితులను ఓటు వేయనివ్వలేదని సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి చేసిన ఫిర్యాదును పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం, రీపోలింగ్ కు ఆదేశించింది. దీంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.

More Telugu News