Uttar Pradesh: యూపీలో దారుణం.. పోలింగ్‌కు ముందే దళిత ఓటర్ల వేళ్లకు సిరా గుర్తులు

  • ఉదయం పోలింగ్.. రాత్రి వేళ్లపై సిరా చుక్కలు
  • పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే, కార్యకర్తల ఆందోళన
  • పోలీసుల హామీతో ధర్నా విరమణ

తుది విడత ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లోని జీవన్‌పూర్‌లో కలకలం రేగింది. ఉదయం పోలింగ్ ప్రారంభం కానుండగా, రాత్రి ఓ అభ్యర్థి మద్దతుదారులు గ్రామంలోని దళిత బస్తీలోని ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. అనంతరం వారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయకుండా ఉండేందుకు వారికి చేతి వేళ్లకు సిరా గుర్తులు వేశారు. విషయం తెలియడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సకల్డీహ ఎమ్మెల్యే ప్రభునారాయణ్ యాదవ్ నేతృత్వంలో ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తలు  అలీనగర్ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. అర్ధ రాత్రి వరకు ధర్నా కొనసాగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలానే జరిగిందని ఎమ్మెల్యే ప్రభు నారాయణ్ ఆరోపించారు. ఓ అభ్యర్థి తరపున నోట్లను పంపిణీ చేసి, సిరా గుర్తులు వేశారని ఆరోపించారు. తద్వారా పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా వారిని అడ్డుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే,  కార్యకర్తల ఆందోళనతో దిగి వచ్చిన పోలీసులు నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నాను వివరమించారు. అనంతరం నిజ నిర్ధారణ కోసం దళిత బస్తీకి వెళ్లారు.

More Telugu News