vaishnav tej: 'ఉప్పెన' నుంచి కొత్త స్టిల్ .. తెలుగు తెరకు మరో అందమైన కథానాయిక

  • వైష్ణవ్ తేజ్ జోడిగా కృతి శెట్టి
  • ఈ నెల 25 నుంచి షూటింగు మొదలు
  • కీలమైన పాత్రలో విజయ్ సేతుపతి

సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఒక విభిన్నమైన ప్రేమకథాచిత్రం రూపొందనుంది. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి 'ఉప్పెన' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా టీమ్ హీరోయిన్ స్టిల్ ను రిలీజ్ చేసింది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ జోడీగా 'కృతి శెట్టి'ని ఎంపిక చేసుకున్నారు. 'సరిగమ' అనే కన్నడ సినిమా ద్వారా వెండితెరకి పరిచయమైన ఈ అమ్మాయి, ఆ తరువాత తమిళ సినిమాలను చేస్తూ వెళుతోంది. 'ఉప్పెన'తో ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఆకర్షణీయమైన కళ్లతో .. నాజూకుగా కనిపిస్తోన్న ఈ అమ్మాయికి, తెలుగు నుంచి మరిన్ని అవకాశాలు దక్కడం ఖాయమనిపిస్తోంది. 'ఉప్పెన'కి దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తుండగా, విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రను పోషించనున్నాడు. 

More Telugu News