vijay devarakonda: విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి రంగం సిద్ధం .. రెండు సీన్లకి 8 కోట్ల ఖర్చు

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా రూపొందిన 'డియర్ కామ్రేడ్' జూలై లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక క్రాంతిమాధవ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కూడా సెట్స్ పై వుంది. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు ఆనంద్ తో ఓ సినిమా చేయడానికి ఆయన సిద్ధమైపోయాడు. ఈ సినిమాను రేపు లాంచ్ చేయనున్నారు.

ఈ నెల 22వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు. తొలి షెడ్యూల్లో భాగంగా ఢిల్లీలో రెండు బైక్ రేసింగ్ సీన్లు చిత్రీకరించనున్నారట. ఈ రెండు సీన్లకే 8 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సీన్స్ కోసం విదేశాల నుంచి బైక్ రేసర్లను .. డ్రోన్లను .. ఆపరేటర్లను పెద్ద సంఖ్యలో రప్పిస్తున్నారట.

More Telugu News