CEC: కౌంటింగ్‌కు అవాంతరాలు లేకుండా చూడండి: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన వైసీపీ నేతలు

  • సీఈసీతో ఎంపీలు, ఇతర నాయకులు భేటీ
  • ఆరోజు టీడీపీ అలజడులు సృష్టించే అవకాశం ఉందని ఫిర్యాదు
  • సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్‌ చేయాలని వినతి

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ఈనెల 23న జరగనున్న దృష్ట్యా ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగేందుకు అదనపు భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈరోజు ఢిల్లీలో పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బుట్టా రేణుక, పండుల రవీంద్రబాబు, అవంతి శ్రీనివాస్‌, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఎన్నికల సంఘం సభ్యులతో భేటీ అయ్యారు.

 కౌంటింగ్‌ రోజున అలజడులు సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించే అవకాశం ఉందని, అందువల్ల అదనపు బలగాలను మోహరించాలని కోరారు. టీడీపీ ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించేందుకు కుట్రపన్నుతోందని తెలియజేసింది. కౌంటింగ్‌ ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాని విజ్ఞప్తిచేశారు.

More Telugu News