swatcha bharath: రైల్వే శాఖ ‘స్వచ్ఛభారత్‌’ చర్యలు.. ఇకపై పట్టాలపై చెత్తవేస్తే ఫైన్‌

  • పర్యవేక్షణకు ఒక్కో స్టేషన్‌లో ఒక్కో అధికారి
  • తాగునీరు, పరిశుభ్రత, నిషేధిత వస్తువుల తొలగింపుపై దృష్టి
  • నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 వేలు ఆపైన జరిమానా

రైల్వేస్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచే చర్యల్లో భాగంగా ‘స్వచ్ఛభారత్‌’ అమలు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇకపై రైలు పట్టాలపై ఎవరైనా చెత్తవేస్తే 5 వేలు, అంతకు మించి జరిమానా విధించనున్నారు. ఇందుకోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి స్టేషన్‌కు ఓ పర్యవేక్షణాధికారిని నియమించి తాగునీరు, పరిశుభ్రత, నిషేధిత వస్తువుల తొలగింపు బాధ్యతలను అప్పగించింది.

ప్రయోగాత్మకంగా తమిళనాడు రాజధాని చెన్నై ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ సహా 19 రైల్వేస్టేషన్లను ఎంపిక చేసింది. అలాగే, తాంబరం, చెంగల్ పట్టు, ఆవడి, తిరువళ్లూరు, కాట్పాడి, పెరంబూరు, జాలర్‌పేట, మాంబళం, గూడువాంజేరి, పెరుంగొళత్తూర్‌, తిరుత్తణి, సింగపెరుమాళ్‌కోయల్‌, చెన్నై బీచ్‌, గిండి తదితర సబర్బన్‌ స్టేషన్లలోనే ఈ నిబంధన అమలు చేయనున్నారు.  

More Telugu News