Chandrababu: చంద్రబాబు, కేసీఆర్, జగన్ ఏకం కావాల్సిన అవసరం ఉంది: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

  • దేశానికి లౌకిక విధానాలతో కూడిన ఫ్రంట్ అవసరం
  • మే 23 తర్వాత మోదీకి మూడు నామాలే మిగులుతాయి
  • పుల్వామా ఘటనకు కేంద్ర ప్రభుత్వమే కారణం

 దేశం కోసం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ లు ఏకం కావాల్సిన అవసరం ఉందని సీపీఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు. దేశానికి లౌకిక విధానాలతో కూడిన ఫ్రంట్ అవసరమని, ఈ నేపథ్యంలో వీరు ముగ్గురూ చేయి కలపాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా మోదీ నెరవేర్చలేదని... మే 23 తర్వాత మోదీకి మూడు నామాలే మిగులుతాయని ఎద్దేవా చేశారు. చాయ్ వాలా అని చెప్పుకుంటున్న మోదీ... మేకప్ కోసం నెలకు రూ. 80 లక్షలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.

పుల్వామా ఉగ్రదాడిలో భారీ సంఖ్యలో జవాన్లు చనిపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని నారాయణ చెప్పారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అందినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. సుప్రీంకోర్టు, సీబీఐ, ఆర్బీఐ, ఈడీ వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను... నడిరోడ్డుపై బట్టలు లేకుండా కేంద్రం నిలబెట్టిందని దుయ్యబట్టారు. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఎన్నికల్లో పోటీకి అనర్హురాలని చెప్పారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేసీఆర్ సర్కారు బాధ్యత వహించాలని... విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి చెప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

More Telugu News