Road Accident: వాహనం చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు ఇండో అమెరికన్లు మృతి

  • అమెరికాలోని ఫిషర్స్ సిటీలో నివాసం
  • ఇండియానాపోలిస్‌లో ప్రమాదం
  • నవ్‌నీత్ సీట్ బెల్ట్ ధరించలేదంటున్న పోలీసులు

ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు ఇండో-అమెరికన్లు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలోని ఫిషర్స్ సిటీలో నివాసముంటున్న వరుణ్‌దీప్ ఎస్‌ బ్రింగ్‌ ‌(19), దవ్‌నీత్‌ ఎస్‌ చాహల్‌ (22) ఈ ప్రమాదంలో మృతి చెందగా, గుర్జాత్‌ ఎస్‌ సంధూ (20) తీవ్రంగా గాయపడ్డారు. వీరు వెళుతున్న స్ఫోర్ట్స్ యుటిలిటి వెహికిల్ ఇండియానాపోలిస్‌లో ఓ చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం అక్కడి కాలమానం ప్రకారం బుధవారం ఉదయం జరిగినట్టు తెలుస్తోంది. 

More Telugu News