ap7am logo

తూర్పు గోదావరి జిల్లాలో అతిరుద్ర మహాయాగం

Wed, Feb 13, 2013, 08:50 AM
శివారాధనలో ఉత్కృష్టమైన
అతిరుద్ర మహాయాగానికి నేడు శ్రీకారం చుడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఐ
పోలవరం మండలం మురమళ్ళలో ఈ మహాయాగాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు
పూర్తయ్యాయి. హైదరాబాదుకు చెందిన యజ్ఞకర్త, ప్రముఖ జ్యోతిష, వాస్తు శాస్త్ర
నిపుణులు కేసాప్రగడ హరిహరనాథ శర్మ నేతృత్వంలో ఈ యాగం జరుగుతోంది. ఆమధ్య
భద్రాచలంలో అతిరాత్రం యాగాన్ని నిర్వహించిన సమతా లోక్ సేవాసమితి ఇప్పుడు ఈ
యాగాన్ని కూడా నిర్వహిస్తోంది.

పదకొండు రోజుల పాటు ఈ మహాయాగాన్ని
నిర్వహిస్తామని శర్మ తెలిపారు. 1901లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ
అతిరుద్రం నిర్వహించారనీ, మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత అదే విధానంలో ఈ
మహాయాగాన్ని తలపెట్టామనీ ఆయన చెప్పారు.యాగశాల చుట్టూ భక్తులు ప్రదక్షిణ
చేసుకునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.  
Tags:
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad