ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల: జూలైలో కౌన్సెలింగ్‌

17-05-2019 Fri 12:53
  • అమరావతిలో విడుదల చేసిన సాంకేతిక విద్యామండలి చైర్మన్‌
  • ఉత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులు
  • జూలై మొదటి వారంలో కౌన్సెలింగ్‌ ఫ్రారంభం
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఎడ్‌సెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి చైర్మన్‌ ఎస్‌.విజయరాజు ఫలితాలను ఈరోజు అమరావతిలో విడుదల చేశారు. ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ జూలైలో  జరుగుతుందని ప్రకటించారు. కాగా, సోషల్‌లో నాగసుజాత, ఫిజికల్‌ సైన్సులో సాయిచంద్రిక, మ్యాథ్స్‌లో పి.పల్లవి, ఆంగ్లంలో హరికుమార్‌, బయాలజీలో మణితేజ మొదటి ర్యాంకు సాధించారు.