Andhra Pradesh: ‘పశ్చిమబెంగాల్ ఘటన’ చంద్రబాబుకు కనిపించడం లేదా?: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

  • బెంగాల్ లో ఓటర్లకు బదులు అధికారి బటన్ నొక్కారు
  • ఈసీ మెతగ్గా ఉండి ఉంటే ఇక్కడా అదే జరిగేది
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పశ్చిమబెంగాల్ లోని ఓ పోలింగ్ బూత్ లో ఓటర్లకు బదులు ఓ మహిళా ఎన్నికల అధికారి స్వయంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బటన్ నొక్కుతున్న వీడియో వైరల్ గా మారిందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ ఘటన చంద్రబాబుకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఏపీ ఎన్నికల సంఘం మెతగ్గా వ్యవహరించి ఉంటే ఇక్కడ కూడా పశ్చిమబెంగాల్ తరహాలో రిగ్గింగ్ కు పాల్పడేవారని ఆరోపించారు.

ఈరోజు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..‘పశ్చిమ బెంగాల్‌లోని ఒక పోలింగ్ బూత్‌లో ఓటర్లకు బదులు ఒక మహిళా అధికారి తానే తృణమూల్ గుర్తు బటన్ నొక్కుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది చంద్రబాబుకు కనిపించలేదా? ఎలక్షన్‌ కమిషన్‌ మెతగ్గా వ్యవహరించి ఉంటే తాను కూడా ఏపీలో ఇదే తరహా రిగ్గింగుకు పాల్పడేవాడు కాదా?’ అని మండిపడ్డారు.

More Telugu News