Mahesh Babu: మహేశ్ బాబు 26వ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరనేది ఖాయమైపోయినట్టే!

  • మహేశ్ 26వ సినిమా దర్శకుడిగా అనిల్ రావిపూడి
  • త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా పనులు
  • దేవిశ్రీ రంగంలోకి దిగే ఛాన్స్  

మహేశ్ బాబు 25వ సినిమాగా వచ్చిన 'మహర్షి' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన 26వ సినిమాకి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ని ఖాయం చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

'మహర్షి' సినిమా పాటల విషయంలో, సోషల్ మీడియా ద్వారా మహేశ్ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తదుపరి సినిమాకి తమన్ ను తీసుకోమని సూచించారు కూడా. కానీ ఈ సినిమా ఫంక్షన్లో మహేశ్ మాట్లాడుతూ, దేవిశ్రీ ప్రసాద్ ను ఆకాశానికి ఎత్తేశాడు. దాంతో తదుపరి సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే దేవిశ్రీనే తీసుకోమని మహేశ్ చెప్పడం .. అందుకు దర్శక నిర్మాతలు ఓకే చెప్పేయడం జరిగిపోయాయని సమాచారం. 

More Telugu News